మహర్షి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ డేట్..

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో పూజా హగ్దే హీరోయిన్ గా అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాఫై అంచనాలు రెట్టింపు చేయగా, ఫస్ట్ లుక్ టీజర్ తో అంచనాలు తారాస్థాయికి వెళ్లడం ఖాయమని అంత భావిస్తున్నారు.

ఇదిలావుంటే ఈ చిత్రం యొక్క టీజర్ ను మహాశివరాత్రి కానుకగా మార్చి 4న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ఇక ఈ చిత్రంలో మహేష్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్ లలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రెండు గెటప్స్ ప్రేక్షకులముందుకు వచ్చి ఆకట్టుకోగా, మూడో గెటప్ కోసం అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.