మహేష్ త్రివిక్రమ్.. సైలంట్ గా సెట్ చేశారా ?


మ‌హేష్ బాబు – త్రివిక్రమ్‌ల‌ది అదిరిపోయే కాంబినేష‌న్‌. `అత‌డు` `ఖ‌లేజా` అలరించాయి. ఇప్పుడు మూడో సినిమాకి రంగం సిద్దమౌతుంది . ఇటివలే మ‌హేష్ త్రివిక్రమ్ మీట్ జరిగింది. `మీకు వీలైతే చెప్పండి.. సినిమా చేసేద్దాం` అని మ‌హేష్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

అయితే ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా సైతం ఫిక్స‌యిపోయింది. అయితే ఇది ఆలస్యం అయ్యే ఛాన్స్ వుంది. ఒక‌వేళ ఎన్టీఆర్ సినిమా ఆల‌స్యమై, ఈమ‌ధ్యలో మ‌రో సినిమా చేసేంత స‌మ‌యం ద‌క్కితే మహేష్ త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ వుంది.