మహేష్ ను బ్రదర్ అంటే ఫ్యాన్స్ కు ఇష్టం ఉండదా..?

తమ అభిమాన హీరోను ఎవరైనా చిన్న మాట అన్న, కాస్త తక్కువ చేసిన చూసిన అభిమానులు అస్సలు తట్టుకోలేరు. తమ కోపాన్నంతా సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసి సదరు వ్యక్తి తలపట్టుకునేలా చేస్తారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పరిస్థితి కూడా ఇంతే అయ్యింది.

పాపం థమన్ చేయని తప్పుకు మహేష్ బాబు అభిమానుల చేతిలో అనవసరంగా బుక్కయ్యాడు. అయినా ఆయన ఏం చేశాడు.. ఎందుకు తిడుతున్నారు అనుకుంటున్నారా.. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. మహేష్ బాబును తమన్ బ్రదర్ అని పిలవడమే ఈ వివాదానికి కారణం.

Great gesture brother !! ✊ https://t.co/4vfkLCuZqE— thaman S (@MusicThaman) August 7, 2020