ఓటిటి బిజినెస్ లోకి మహేష్..?

ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమర్ల హావ బాగా పెరిగింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్‌ వంటి అగ్ర సంస్థలు ఓటీటీ రంగంలో దూసుకెళ్తున్నాయి. దీంతో చాలామంది అగ్ర నిర్మాతలు ఈ రంగంలోకి వచ్చేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

రీసెంట్ గా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, శరత్ మరార్ మొదలగు వారు రాగా..తాజాగా సూపర్ స్టార్ మహేష్ సైతం ఈ బిజినెస్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడట. ఇప్పటికే థియేటర్స్, గార్మెంట్స్, చిత్ర నిర్మాణం వంటి పరిశ్రమలలోకి అడుగుపెట్టిన మహేష్ ఏదైనా ట్రెండీ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనే ఉద్దేశ్యం తో ఓటిటి అడుగులోకి అడుగుపెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.