మలైకా అరోరా పరువు పోయింది


బాలీవుడ్ భామ మలైకా అరోరాకు గట్టి షాక్ ఇచ్చారు నెటిజన్లు. ప్రస్తుతం ‘10 year challenge’ పేరిట ఓ ఛాలెంజ్‌ వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో భాగంగా సెలబ్రిటీలు, సామాన్యులు తమ పదేళ్ల క్రితం నాటి ఫొటోను ఇప్పటి ఫొటోను పక్కపక్కన పెట్టి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు సెలబ్రిటీల ఫొటోలను మీమ్స్‌లా రూపొందించి కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఛాలెంజ్‌లో మలైకా పాల్గొన్నారు. షారుక్ ఖాన్‌ ‘దిల్‌సే’ (1998)‌ సినిమాలోని ‘ఛైయ్య ఛైయ్య..’ ప్రత్యేక గీతంలో తన స్టిల్స్‌ను, తాజాగా దిగిన స్టిల్స్‌‌ను జత చేసి రెండు ఫొటోలు షేర్‌ చేశారు. ‘నా ‘టెన్‌ ఇయర్‌ ఛాలెంజ్‌’.. గత పదేళ్లు అద్భుతంగా గడిచాయి. రాబోతున్న పదేళ్ల కోసం ఎదురుచూస్తున్నా’ అని రాశారు. మలైకా పోస్ట్‌పై నెటిజన్లు మండిపడ్డారు. పదేళ్లంటూ.. ఇరవై ఏళ్ల ఫొటోను షేర్‌ చేస్తావా? అని విమర్శించారు. దీంతో మలైకా ఆ పోస్ట్‌‌ను మార్చేసింది. ‘10‌ ఇయర్‌ ఛాలెంజ్‌’ను కాస్త ‘20 ఇయర్‌ ఛాలెంజ్‌’గా చేసింది.