‘మణికర్ణిక’ ఫస్ట్ లుక్..

తెలుగులో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం తో పెద్ద సాహసమే చేసి విజయం అందుకున్న క్రిష్ , తాజాగా మరోసారి మరో పెద్ద సాహసం తో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారతదేశ ప్రజలందరికీ బాగా సుపరచితమైన ‘రాణి లక్ష్మీ భాయ్’ యొక్క జీవితగాథను ‘మణికర్ణిక’ గా తెరకెక్కిస్తున్నాడు. ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయినా కంగనా ఈ మూవీ లో లక్ష్మీ భాయ్ పాత్ర లో కనిపిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీఎప్ఎక్స్‌కి సంబంధించిన వ‌ర్క్ పూర్తి కాక‌పోవ‌డంతో జ‌న‌వ‌రి 25న సినిమాని రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది .