ఆచార్య సాంగ్స్ గురించి మణిశర్మ ఏంచెప్పాడంటే..

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఫామ్లోకి వచ్చిన మెలోడీ బ్రహ్మ తాజాగా తన పుట్టిన రోజు నాడు తన కొత్త ప్రాజెక్ట్ ల వివరాల గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ కి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలోని సాంగ్స్ గురించి ప్రశ్నించగా.. మూవీ లోని సాంగ్స్ సందర్భోచితమైన పాటలే ఉంటాయని వెల్లడించారు. ఓవరాల్ గా ఆల్బమ్‌లో ఒక సిజ్లింగ్ స్పెషల్ సాంగ్, ఒక రొమాంటిక్ డ్యూయెట్, ఒక ఎమోషనల్ సాంగ్ మరియు డ్యాన్స్ నంబర్ ఉన్నాయని. అలాగే ఈ చిత్రంలో బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ కు చాలా ప్రాముఖ్యత ఉంటుందని’ మణిశర్మ తెలిపారు.

ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది. అలాగే మెగా వారసురాలు నీహారిక కొణిదెల కూడా ఓ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.