తాప్సీ ఘాటైన లిప్ లాక్ చూసారా..?

తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం వరుస హిట్లతో దూసుకెళ్తుంది తాప్సీ . ఇప్పటికే `పింక్`, `జుడ్వా 2` చిత్రాలతో హిట్లు అందుకున్న తాప్సీ తాజాగా మన్మార్జియాన్ అనే చిత్రం తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఆనంద్ .ఎల్.రాయ్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యం లో ఈ చిత్ర ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో విక్కీ కౌశల్ తో తాప్సీ చేసిన ఘాటైన లిప్ లాక్ సినిమా ఫై యూత్ లో ఆసక్తి పెంచేసింది. గతంలో ఎప్పుడు ఇంత ఘాటైన లిప్ లాక్ తాప్సి నుండి చూడకపోయేసరికి తెలుగు ఆడియన్స్ సైతం ఈ సినిమా ఫై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఓ సారి ఈ ఘాటైన ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.