మే అంత మహానటిదే..

మొత్తానికి సమ్మర్ చివరి దశకు చేరుకుంది..సమ్మర్ అంత హాట్ హాట్ గా సాగింది..ఇక సినిమాల విషయానికి వస్తే మాత్రం ప్రతి నెల ఓ బ్లాక్ బస్టర్ సినిమా వచ్చి సినీ ప్రేక్షకులను అలరించింది. మార్చి నెల చివరి వారం లో రంగస్థలం అంటూ వచ్చి చిట్టిబాబు పెద్ద సౌండే చేసాడు. రామ్ చరణ్ – సుకుమార్ కలయిక లో వచ్చిన ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ సృష్టించి మెగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అలాగే ఏప్రిల్ మూడో వారం లో మహేష్ బాబు భరత్ అనే నేను అంటూ వచ్చి బాగానే అలరించాడు. దాదాపు రూ. 105 కోట్లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టాడు. రంగస్థలం ,భరత్ అనే నేను ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇక మే 09 న ఏలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మహానటి. అలనాటి నటి సావిత్రి జీవిత కథ గా వచ్చిన ఈ మూవీ కి సూపర్ హిట్ అనే మౌత్ టాక్ రావడం తో , విడుదలైన రెండో రోజు నుండి కలెక్షన్ల వర్షం కురిపించడం మొదలు పెట్టింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ నా పేరు సూర్య , మెహబూబా , నేల టికెట్ , అమ్మమ్మ గారి ఇల్లు , కాశి చిత్రాలు వచ్చినప్పటికీ మహానటి ముందు ఏ మాత్రం సందడి చేయలేక పోయాయి. కేవలం వారం లోనే ఈ చిత్రాలు వెనక్కి వెళ్లిపోవడం తో మే అంత మహానటి హవానే కొనసాగింది.

ఇక ఈరోజు ( జూన్ 1 ) బాక్స్ ఆఫీస్ మీదకు మూడు సినిమాలు వచ్చాయి. వర్మ – నాగ్ ఆఫీసర్ , రాజ్ తరుణ్ రాజుగాడు, విశాల్ – సమంత ల అభిమన్యుడు చిత్రాలు వచ్చాయి.మరి ఈ మూడింట్లో ఏది విజయం సాధిస్తుందో చూడాలి.