చిరు కధని కొరటాల కాపీ కొట్టాడా ?


మెగా కొత్త సినిమాకి కొబ్బరికాయ్ కొట్టారు. సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు దసరా కానుక ప్రకటించారు. ఆయన 152వ సినిమా షురూ అయ్యింది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దసరా సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. చిరు, రామ్ చరణ్ కొరటాల శివతోపాటు అంజనా దేవి, సురేఖ, సుస్మిత తదితరులు పూజకు హాజరయ్యారు

కాగా ఈ సినిమాకి సంబధించిన ఓ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రామ్ చరణ్ మలయాళం సినిమా లూసిఫర్ హక్కులు కొనుక్కున్నాడు. చిరంజీవితో ఇది రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అసలు సంగతి ఏమిటంటే.. కొరటాల తయారు చేసుకున్న కధ .. లూసిఫర్ కి కొంచెం దగ్గరగా వుందట. అందుకే మళ్ళీ కాపీ రైట్ వివాదాలు తలెత్తకుండా ముందే ఆ సినిమా హక్కులు కొనుక్కొని పెట్టుకున్నారని టాక్.