మెహ్రీన్ ఆశలన్నీ విజయ్ పైనే..

కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన మెహ్రీన్..మొదటి సినిమా తోనే సూపర్ హిట్ అందుకొని యూత్ కు బాగా దగ్గరయింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అమ్మడి తలుపు తట్టాయి. కానీ ఆ రేంజ్ లో హిట్లు మాత్రం పడలేదు. ఈ మధ్య జవాన్ , పంతం సినిమాలు వరుస ప్లాప్స్ కావడం తో ఇప్పుడు ఈ అమ్మడి ఆశలన్నీ నోటా పైనే పెట్టుకుంది.

విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళ్ భాషల్లో ఈరోజు గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ చిత్రం మెహ్రీన్ జనరలిస్ట్ రోల్ లో నటిస్తుండగా , విజయ్ సీఎం రోల్ లో కనిపించబోతున్నాడు. తెలుగు లో ఎలాగూ ఈమెకు మంచి గుర్తింపు ఉంది..ఇక తమిళం లో ఈ చిత్రం తో పాపులర్ అవుతునేమో అనే నమ్మకం పెట్టుకుంది. మరి ఈమె నమ్మకాన్ని ఈ చిత్రం ఎంత వరకు నిలబెడుతుందో..వరుస ప్లాపుల్లో ఉన్న ఈమెకు నోటా ఎలాంటి విజయం అందిస్తుందో..విజయ్ క్రేజ్ ఈ భామ కు ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.