హీరోగారి భార్యపై విమర్శలు

బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ భార్య మీరా రాజ్‌పుత్‌కు సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఓ ప్రముఖ సౌందర్య సాధనాల సంస్థ ప్రకటనలో నటించినందుకు ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరా రాజ్ పుత్ ప్రస్తుతం గర్భవతి.. మరికొన్ని నెలల్లోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలో తల్లిగా గర్వపడాల్సిన సమయం.కానీ ఆమె ఇటీవల ఓ ప్రముఖ సౌందర్య సాధనాల సంస్థ ప్రకటనలో నటించింది. అందులో ఆమె చెప్పిన డైలాగులు విమర్శలపాలయ్యాయి.

మీరా రాజ్ పుత్ ఆ యాడ్ లో మాట్లాడుతూ ‘తల్లిగా మారినంత మాత్రాన.. మీకు మీరుగా ఉండే హక్కును కోల్పోయినట్టు కాదుగా.. ఇదిగో ఇదే నా రీబార్న్ స్టోరీ’ అని యాంటి ఏజింగ్ క్రీమును రాసుకుంది. అంతేకాదు ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తల్లిగా ఉండి ఆ హోదాకు మచ్చ తెచ్చేలా వయసు పెరగకుండా క్రీములు వాడండి అని చెప్పడం అవమానించడమేనని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 23 ఏళ్ల యువతి.. యాంటీ ఏజింగ్‌ క్రీమ్‌కు ప్రచారం చేయడమేంటి.. నాన్సెన్స్‌’ అని తిట్టి పోస్తున్నారు.