ఫస్ట్‌లుక్‌ : మోడీ మరో బయోపిక్‌ ‘మనోవిరాగి’

ప్రధాని నరేంద్ర మోడీపై ఇప్పటికే ‘పీఎం నరేంద్ర మోడీ’ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. మోడీ బయోపిక్‌ వివేక్‌ ఒబేరాయ్‌ చేసిన విషయం తెల్సిందే. ఆ చిత్రం ఎన్నికల సమయంలో వివాదంలో చిక్కుకోవడంతో పాటు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఆ చిత్రం ఫ్లాప్‌ అయ్యింది. మోడీ గురించి ప్రేక్షకులకు తెలిసిన విషయాలనే ఆ చిత్రంలో చూపించడం జరిగింది. కాని మోడీ గురించి తెలియని విషయాలను మాత్రం ఇప్పుడు చెప్పేందుకు సిద్దం అవుతున్నారు.

నేడు మోడీ బర్త్‌డే సందర్బంగా సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మాణంలో ఒక చిత్రం ప్రారంభం అయ్యింది. ఆ చిత్రానికి ‘మన్‌ బైరాగి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగులో ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రభాస్‌ ‘మనో విరాగి’ అనే టైటిల్‌ను ప్రకటించారు. మోడీ జీవితంలోని కీలక సంఘటనలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. భార్యను వదిలేయడం, కుటుంబంను వదిలేయడం వంటి సంఘటనలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. మోడీ బయోపిక్‌ను అత్యంత విభిన్నంగా చూపించబోతున్నట్లుగా దర్శకుడు సంజయ్‌ త్రిపాఠి చెప్పుకొచ్చాడు.