ట్రైలర్ టాక్; మిస్టర్ మజ్ను`

అఖిల్ `మిస్టర్ మజ్ను` ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ విషయానికి వస్తే.. అమ్మాయిల్ని ఫ్లిర్ట్ చేస్తూ లైన్ లో పెట్టేస్తుంటాడు అఖిల్. అతడికి పడని అమ్మాయే లేదు. అబద్ధాలు చెప్పి మరీ పడగొట్టేస్తుంటాడు. అలా నిధిని కూడా ఫ్లిర్ట్ చేస్తాడు. అయితే అది కేవలం కవ్వించి వదిలేసే ప్రేమ కాదని మజ్ను తెలుసుకునేప్పటికి అంతా అయిపోతుంది. అన్ని ప్రేమకథల్లానే ఈ కథలోనూ బోలెడంత డ్రామా విరహం ఉంటుందని ట్రైలర్ చెబుతోంది.

‘నాకోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు. కానీ నా వల్ల ఒక్కరు ఏడ్చినా అది ఖచ్చితంగా నా తప్పే’ అని డైలాగ్ ఈ సినిమా థీమ్ ని చెబుతుంది. ‘కాసేపు ప్రేమించి, ఆ తరువాత ఎక్కువ ప్రేమించి, ఆపై మరింత ప్రేమించి, పెళ్లి చేసుకునే టైపు లవ్వా? చచ్చాంపో.. అది అయితే అస్సలు చాతకాదు’ అనే డైలాగు సబ్జెక్ట్ సింపుల్ గా చెబుతుంది. ‘కొన్ని ప్రేమ కథలు చాలా సింపుల్ గా వుంటాయి”.. మిస్టర్ మజ్ఞు ట్రయిలర్ లో చూపించిన ఓ క్యాప్షన్ ఇది. ఈ కధ కూడా సింపుల్ గానే ఉండబోతుందని అర్ధం చేకోవచ్చు. అయితే ఆ సింపుల్ కధలోనే బోలెడు వినోదం పంచబోతున్నారు మజ్ను యూనిట్.