మహానాయకుడుపై నాదెండ్ల కామెంట్స్

నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్లోని రెండో పార్ట్ ఎన్టీఆర్- మహానాయకుడు.. ట్రైలర్.. మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ని, కాంగ్రెస్ పార్టీలని టార్గెట్ చేఇస్న్ది. ఎన్టీఆర్ నుంచి అధికారం లాగేసుకున్న నాదెండ్ల.. ఈ సినిమాలో తనను విలన్గా చూపిస్తే… హీరో బాలకృష్ణ దర్శకుడు క్రిష్లపై కోర్టుకెక్కుతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఆయన ఇప్పటికే బాలయ్య క్రిషలతో పాటు సెన్సార్ బోర్డులకు కూడా నోటీసులు పంపారు.

తాజాగా ఆయన స్పందిస్తూ.. ఎన్టీఆర్ ని తాను వెన్నుపోటు పొడవలేదని, తనను ఎన్టీఆరే వెన్నుపోటు పొడిచాడని, ఈ విషయమై ప్రజలను అడిగితే వారే చెబుతారని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన విషయంలో చంద్రబాబుది ఎటువంటి పాత్ర లేదని, ఆయనదేమీ తప్పులేదని, అందులో కేవలం తన పాత్రే ఉందని, పడిపోయిన పార్టీని బాబు నిలబెట్టాడని ఆ కుటుంబం ఉద్దేశమని విమర్శించారు.