అప్పుడు అంత మాట అనేసి ఇప్పుడెలా చేస్తున్నాడు..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 వచ్చే నెలలో మొదలు కాబోతుంది. ఈ సీజన్ కు హోస్ట్ గా నాగార్జున వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబందించిన ప్రోమో సైతం విడుదలై ఆసక్తి పెంచేస్తుంది. ఇదిలా ఉంటె తాజాగా నాగ్ ఫై పెద్ద ట్రోల్ నడుస్తుంది. గతంలో నాగ్ బిగ్ బాస్ ఫై ఓ రేంజ్ లో నెగిటివ్ కామెంట్స్ చేసాడు. బిగ్ బాస్ కాన్సెప్ట్ నాకు నచ్చదు అని.. కొంత మంది వ్యక్తులను ఒక చోట ఉంచి వారు ఏం చేస్తున్నారో దొంగ చాటుగా చూడటం అనేది గాసిప్ తో సమానమని..ఇద్దరు శృంగారం చేసుకుంటూ ఉంటే మరో వ్యక్తి చూసినట్లుగానే బిగ్ బాస్ షో కాన్సెప్ట్ ఉంటుందనే అర్థం వచ్చేలా నాగార్జున మాట్లాడాడు.

ఆలా మాట్లాడిన నాగ్ ఇప్పుడెలా హోస్ట్ గా చేస్తున్నాడని అంత కామెంట్స్ వేస్తున్నారు. దీనిపై నాగ్ ఎలాంటి సమాధానం తెలుపుతారో చూడాలి. ఇక ఈ సీజన్ ను బిగ్ బాస్ యాజమాన్యం చాల కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తుంది. గత రెండు సీజన్ల కంటే చాల కలర్ ఫుల్ గా టాప్ స్టార్స్ తో నిర్వహించబోతుంది.