‘బ్రహ్మాస్త్ర’ ను పూర్తి చేసిన నాగ్..

కింగ్ నాగార్జున..దాదాపు పదిహేనేళ్ల తర్వాత బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ‘బ్రహ్మాస్త్ర’ మూవీతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌లు హీరో, హీరోయిన్లుగా నటిస్తుండగా , బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో నాగార్జున ఓ ముఖ్య క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీలో నాగార్జున రోల్ కు సంబంధించిన షూటింగ్ పూర్తియింది. లండన్‌లో ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఈ సందర్భంగా అక్కడ నా లాస్ట్ డే షూట్ అంటూ ఒక ఫోటోను అభిమానులకు షేర్ చేసాడు నాగార్జున.

ఇటీవలే తెలుగులో నాగార్జున హీరో నాని తో కలిసి దేవదాస్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ , అంచనాలను అందుకోవడం లో అంతగా సక్సెస్ కాలేదు.