ఆ మూడింటి కోసమే దేవదాస్ చేసాడట..

నాని – నాగార్జున కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం దేవదాస్. శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్ర ఆడియో వేడుక సెప్టెంబర్ 20 న హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ..ఈ సినిమా ఒప్పుకోడానికి మూడు కారణాలు అని తెలిపాడు. ఒకటి స్క్రిప్ట్, రెండు అశ్వనీదత్, మూడు నాని అని చెప్పుకొచ్చాడు.

ఈ పాత్రలో నేను పెద్దగా నటించాల్సిన అవసరం లేదని స్క్రిప్ట్ వినగానే చెప్పేశా. అయితే, రెండో పాత్రలో నాని చేస్తున్నాడని తెలియగానే.. అతను కూడా నటించక్కర్లేదు.. సరిగ్గా సరిపోతాడని చెప్పా’’ అని నాగార్జున తెలిపారు. నిర్మాత అశ్వనీదత్ గురించి మాట్లాడుతూ ‘‘24 ఏళ్ల వయస్సులో ‘ఒక సీత’ సినిమా తర్వాత ఆయన తెల్లవారుజామున 4 గంటలకు లేచి.. పెద్దాయన ఎన్టీ రామారావుగారి ఇంటి ముందు నుంచునేవారు. ఇలా నాలుగు నెలలు నుంచుంటే ఆయనకు ‘ఎదురులేని మనిషి’ సినిమా అవకాశం ఇచ్చారు. రామారావుగారే వైజయంతి మూవీస్‌ను ఆవిష్కరించారు. ఆ లోగోలో ఎన్టీఆర్ ఫొటో ఇప్పటికీ ఉంటుంది. అశ్వనీదత్ అత్యధిక సినిమాలు నాతోనే తీశారు. ఆయనకు సినిమా అంటే ప్రాణం. ‘ఆఖరి పోరాటం’ సినిమాకు శ్రీదేవిని, ఓ ప్రత్యేక గీతం కోసం ఐశ్వర్యరాయ్‌ను నాకోసం తీసుకొచ్చారు’’ అందుకే ఆయనంటే ఎంతో ఇష్టమని తెలిపాడు.

ఆ తర్వాత నాని.. ‘‘మల్టిస్టారర్ చేస్తే నానితోనే చేయాలని అనుకున్నా. నాని డైలాగ్ డెలివిరి వింటే పాట వింటున్నట్లే ఉంటుంది. చాలా చక్కని వాయిస్’’ అని నానిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇదే వేడుకలో చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి ఇంకాస్త సినిమాపై ఆసక్తి పెంచారు. మొత్తానికి ఆడియో వేడుక చాల కలర్ ఫుల్ గా జరిగింది. సెప్టెంబర్ 27 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.