రేయ్ అఖిల్ .. మాస్ నేర్చుకోరా అక్కడ

” మా పెద్దబ్బాయ్ తారక్ ” అని అన్నారు నాగార్జున. అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడతూ.. ‘మా పెద్దబ్బాయ్ తారక్.. తను నన్ను చాలా ఆప్యాయంగా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాడు. సంతోషం అనిపిస్తుంది. అఖిల్ నేర్చుకోవాల్సింది తారక్ దగ్గర నుంచి యాక్టింగ్ .. మాస్.. అని అన్నారు. ”అఖిల్ వైపు తిరిగి.. రేయ్ .. మాస్ నేర్చుకోరా అక్కడ” అని నవ్వారు.

ఇక ఈ సినిమా గురించి మాట్లాడతూ.. మజ్ను టైటిల్ మా నాన్నగారిది. తర్వాత నాకు వచ్చింది. ఇప్పుడు అఖిల్ కి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిర్మాత బివిఎస్.ఎన్ గారు మగధీర (సహనిర్మాత) అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చారు ఆయన ఈ సినిమాతో మరో హిట్ కొడుతున్నారు. ఈ బ్యానర్ లో అఖిల్ సినిమా చేయడం సంతోషంగా ఉంది” అన్నారు.