నాగ శౌర్య పెద్ద సాహసమే చేశాడు

తగ కొన్నాళ్లుగా టాలీవుడ్ రూటు మారింది. సినిమాలో మాస్ మసాలా ఉంటే చాలు అనే ధోరణి మారింది. ముఖ్యంగా మీడియం హీరోలు ఈ ఛట్రం నుండి బయటపడ్డారు. కథలో ఖచ్చితంగా కొత్తదనం చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రయోగాలకు కూడా వెనకాడటం లేదు. ఇప్పుడు నాగ శౌర్య కూడా ఓ ప్రయోగం చేశాడు. ప్రయోగం అనడం కంటే సాహసం అనాలి.

నాగ శౌర్య లేటెస్ట్ సినిమా ‘నర్తనశాల’. శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకుడు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగశౌర్యను గే పాత్రలో కనిపించి షాక్ ఇచ్చాడు. ‘నా కొడుకు గేనా?..’ అని హీరో తండ్రి కంగారు పడటం చుస్తే నిజంగా షాకింగ్ ఉంది.

హీరోల మైండ్ సెట్ మారింది అనడానికి ఈ టీజర్ కథ మంచి ఉదాహరణ. నిజంగా ఇలాంటి రోల్ చేయడానికి హీరోకి ధైర్యం కావాలి. మరి ఇందులో కొత్తదనం ఏమిటో గానీ జె పాత్ర ఒప్పుకొని పెద్ద సాహసమే చేశాడు నాగ శౌర్య.