నగ్నం బ్యూటీ కోసం స్టార్ డైరెక్టర్ ట్రై చేస్తున్నాడట..

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నగ్నం సినిమా తో స్వీటీ (శ్రీ రాపాక) నెటిజన్లను ఆకట్టుకుంది. అమ్మడి అందాల ఆరబోతకు సినీ అభిమానులు , సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. తాజాగా ఈ భామ కోసం స్టార్ డైరెక్టర్ ట్రై చేస్తున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

సక్సెస్ అయిన రియాలిటీ షో లలో ‘బిగ్ బాస్’ ఒకటి. ఎన్నో వివాదాల నడుమ తెలుగులో కూడా ప్రసారం అయిన ఈ షోకు ఫస్ట్ సీజన్ నుంచే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ కి కూడా గుర్తింపు దక్కుతూ వస్తోంది. అందుకే ‘బిగ్ బాస్’ లో పాల్గొనే అవకాశం వస్తే హౌస్ లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ‘బిగ్ బాస్’ ఇప్పుడు సీజన్ 4 కి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో సీజన్ 4 కోసం మరింత గ్లామర్ యాడ్ చేయాలని యాజమాన్యం ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ క్రమంలో బిగ్ బాస్ 4లోకి శ్రీ రాపాక ని తీసుకోమని రామ్ గోపాల్ వర్మ సదరు షో నిర్వాహకులకు రికమెండ్ చేస్తున్నారట.