నాని ‘వి’ రిలీజ్ ఎప్పుడంటే

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం వి. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్షన్లో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉగాది కానుకగా మర్చి 25 ‘న రిలీజ్ చేయాలనీ నిర్మాత దిల్ రాజు అనుకున్నాడు. కానీ అదే సమయంలో కరోనా వైరస్ ఎంట్రీ కావడం , ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడం తో సినిమా ల్యాబ్ కే పరిమితం అయ్యింది.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ల్యాబ్ కే పరిమితమైన సినిమాలు ఓటిటి లో రిలీజ్ అవుతుండగా..వి చిత్రం సైతం ఓటిటి రిలీజ్ చేయాలనీ అంత డిమాండ్ చేసారని కానీ ఓ టి టి లో విడుదల చేసే ఆలోచన లేకపోవడంతో నిర్మాతలు థియేటర్స్ తెరుచుకోవాలని కోరుకుంటున్నారు. కాగా థియేటర్స్ ప్రారంభమైన నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారట.

ఈ మూవీలో నాని సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్నారు. ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్ కలిగివుంటుందట. ఇక మరో హీరో సుధీర్ పోలీస్ పాత్ర చేస్తున్నారు. వీరి మధ్య నడిచే వార్ మూవీలోని ఆసక్తి కర అంశం అని తెలుస్తుంది. నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.