భళారే విచిత్రం సీక్వెల్ ఫై మనసుపారేసుకున్న హీరో..

హీరో నరేష్..ఈ పేరు చెప్పగానే వెంటనే జంబలకిడి పంబ సినిమా గుర్తుకొస్తుంది. ఈ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం లో వచ్చిన జంబలకిడి పంబ చిత్రం నరేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలువడమే కాదు , ఆయనకు ఓ మైలురాయి గా నిలిచిపోయింది. అనేక తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించి , ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస అవకాశాలతో బిజీ యాక్టర్ అయ్యారు.

ఈ ఏడాది రంగ‌స్థ‌లం, ఛలో, ఛల్ మోహన్ రంగ, మ‌హాన‌టి, స‌మ్మోహ‌నం వంటి వరుస హిట్లతో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా సమ్మోహనం చిత్ర సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఈయన భళారే విచిత్రం సినిమాకు సీక్వెల్ చేయాలని ఉందన్నారు.‘నపుంసకుడి పాత్ర చేయాలన్నది నా చిరకాల కోరిక. స్వతహాగానేను రచయితను. ఇంగ్లిష్‌లో చాలా కవితలు రాశాను. వాటన్నింటినీ ఓ బుక్‌గా ప్రచురించే ఆలోచనలో ఉన్నాను. టైమ్ దొరక్క కుదురడం లేదు. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. సినిమా కోసం కథ రాశాను. ఓ దర్శకుడికి నచ్చింది. దానిని సినిమాగా తీయడానికి సిద్ధంగా ఉన్నారు. దర్శకుడిగా నాకు గతంలో అవకాశాలు వచ్చాయి. కానీ ఇంకో పదేండ్లు నటుడిగానే కొనసాగాలనుకుంటున్నాను. 65 యేండ్ల తర్వాత రాజకీయాలతో పాటు ఇతర రంగాల గురించి ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చాడు.