అప్పుడే ‘మా’ వార్ ప్రకటించిన నరేష్

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ ఎన్నికలు గత రెండు పర్యాలు ఆసక్తిని రగిలించిన సంగతి తెలిసిందే. రెండు వర్గాలుగా సినీ రాజకీయం నడిచింది. గడచిన ఎన్నికల్లో శివాజీ రాజా వర్గం నెగ్గింది. అయితే ఇప్పుడు ఎన్నిక దగ్గర పడుతుంది. ఈ సారి నరేష్ రంగంలో దిగుతున్నారు. అప్పుడే ఆయన ఓ ప్రకటన చేశారు.

‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ సభ్యుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాల్ని ప్రవేశ పెట్టాం. త్వరలో ‘మా’ ఎన్నికలు జరగబోతున్నాయి. అధ్యక్షుడ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అది కుదరని పక్షంలో ఎన్నికల బరిలో దిగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ‘మా’ అధ్యక్షుడిగా ఎవరు పనిచేసినా ఒక పర్యాయం మాత్రమే ఆ పదవిలో ఉండాలని మాలో మేం అనుకున్నాం. నేనూ అంతే. ఒక్కసారి ‘మా’ అధ్యక్షుడిగా పనిచేస్తే జీవిత కాలంలో ఆ పదవి వైపు చూడను” అని చెప్పుకొచ్చారు నరేష్.