ఇది లేదు కానీ అదా..?

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత దూకుడు ను పెంచాడు. వరుస పెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన దూకుడు ను కనపరుస్తున్నాడు. ప్రస్తుతం రవికుమార్ డైరెక్షన్లో చేసిన రూలర్ చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే అప్పుడే బాలకృష్ణ – బోయపాటి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలు అయ్యిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని ఎరియాలకు ఫ్యాన్సీ రేట్లు ఇచ్చేందుకు బయ్యర్లు ముందుకొస్తున్నారని అంటున్నారు. కానీ సినీ వర్గాలు మాత్రం అదేమీ లేదని ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు.