బ్యాచిలర్ లో మరో హీరోయిన్ కూడానా..?

అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో అఖిల్ నాల్గో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. సంక్రాంతి బరిలో ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చూస్తున్నారు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో ముద్దు గుమ్మ కనిపించనుంది. అమె పూరి సినిమా మెహబూబా ఫేమ్ స్నేహా శెట్టి కూడా ఈ సినిమాలో కనిపించనుంది. ఈ అమ్మడు ప్రేక్షకులను తన మొదటి సినిమా మెహబూబాతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సారి వచ్చిన అవకాశాన్ని ఆసరాగా తీసుకొని టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారేందుకు ప్రయత్నించనుంది. ఈ సినిమాలో అఖిల్‌కు స్నేహాకు కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.