బీచ్ లో నిహారిక పోజ్..

మెగా డాటర్ నిహారిక ..మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మొదటి హీరోయిన్ గా వార్తల్లో నిలిచింది. ఒక మ‌న‌సు చిత్రంతో ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచమైన ఈ భామ మొదటి సినిమాతో భారీ డిజాస్టర్ నే చవిచూసింది..ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఏడాది హ్యాపీ వెడ్డింగ్ తో వచ్చింది. కానీ ఈ మూవీ కూడా డిజాస్టర్ గా నిలవడంతో పాటు అంతకు ముందు తమిళ్ లో విజయ్ సేతుపతితో చేసిన ఫాంటసీ మూవీ కూడా చేదు ఫలితాన్ని ఇవ్వడం తో మరో సినిమా చేసేందుకు కాస్త ఆలోచనలో పడింది.

ప్రస్తుతం స్నేహితుల తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగా స్నేహితులతో కలిసి వియత్నాం బీచ్ లో గడుపుతున్న నీహారిక అక్కడ బీచ్ ఒడ్డులో నడుస్తున్న పిక్ ఒకటి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ముఖం చూపించకుండా కేవలం వెనుక నుంచి మాత్రమే కనిపించేలా ఉన్న పిక్ ను పోస్ట్ చేసింది.