నిహారిక.. ప్రమోషన్ ఎక్కువ..పని తక్కువ

మెగాస్టార్ ఇంటి నుండి వస్తున్న సినీ వారసురాలు అంటే అందరిలో ఒక ఆసక్తి. నిహారిక ఎలా చేస్తుందో అని ఒక ఇంట్రస్ట్. మొదటి సినిమా(ఒక మనసు) తో ఇది పోయింది. ఆ సినిమా ఆడకపోగ విసిగించింది. నిహారిక మేలో డ్రామా నటనకు జస్ట్ పాస్ మార్కులు పడ్డాయి. రెండో సినిమా చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. కాని అలాంటి జాగ్రత్తలు ఏమీ కనిపించలేదు. హ్యాపీ వెడ్డింగ్ అనేపేరు పెట్టారే కాని సినిమా చుసిన ప్రేక్షకుడికి హ్యాపీని ఇవ్వలేకపోయారు.

పాత చింతకాయ పచ్చడి లాంటి కధను పట్టుకొచ్చారు. మెగా కథానాయిక‌ అనే బ్రాండ్ కూడా ఏమాత్రం ప‌నిచేయ‌లేద‌న‌డానికి ఈ సినిమాకి వ‌చ్చిన వ‌సూళ్లే సాక్ష్యం. పైగా ఈ సినిమాలో నిహారిక చేసింది ఏమీ లేదు. ఎదో అలా నవ్వడం అయోమయంహా ఫేస్ పెట్టడం తప్పితే ఆమె గురించి చెప్పాడనికి ఏం లేదు. ఒక మనసు సినిమాలో కనీసం ఆమె కట్టిన చీరలు గురించి అయినా చెప్పుకున్నారు. కాని ఇందులో అదీ లేదు.

ఎదో అన్నట్టు వెబ్ సీరిస్ చేసినట్లు ఒక సినిమా తీసి థియేటర్ లోకి వదిలారు. పైగా ‘నిహారిక పెళ్లి’ గోల అంటూ బోలెడు ప్రమోషన్లు చేసేశారు. నిహారిక కూడా ఏకంగా ఒక వీడియో బైట్ లాంటింది ఇచ్చి హంగామా చేసిందే కానీ సినిమాలో విషయం వుందా లేదా చూసుకోలేదు. ఎంత ప్రమోషన్ చేసిన మేటర్ లేకపోతే మెగాస్టార్ ట్యాగ్ కూడా దేనికి పనికిరాదనీ ఇప్పటికే నిహారికకు అర్ధమైవుండాలి. ఇకపైనా కేవలం ప్రమోషన్స్ మీద కాకుండా పని మీద, ఎంచుకునే కధపైన ఎక్కువ ద్రుష్టి పెడితే నిహారిక కెరీర్ కు మంచింది.