అర్జున్ హిట్ కొట్టే మాదిరే కనిపిస్తున్నాడు..

నిఖిల్ నుండి రాబోతున్న తాజా చిత్రం అర్జున్ సురవరం. గత కొద్దీ నెలలుగా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్ కే పరిమితం అయినా సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప సినిమా మాత్రం రిలీజ్ కావడం లేదు. ఇక ఈ సినిమా రిలీజ్ కాదని అంత ఫిక్స్ అయినా నేపథ్యంలో నవంబర్ 29 వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు.

ప్రస్తుతం సినిమా ప్రమోషన్లో భాగంగా నిఖిల్ ఈ సినిమా కోసం చాల కష్టపడినట్లు చెప్పుకొచ్చాడు. ఆయన పడిన కష్టం వృధా కాదని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. మొన్నటి వరకు సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా ట్రైలర్ వచ్చాక మాత్రం అంత ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాతో నిఖిల్ హిట్ కొడతాడని..తన సత్తా చాటడం గ్యారెంటీ అని అంటున్నారు. ఎడ్యుకేషన్ మరియు సర్టిఫికెట్స్ మాఫియాపై అర్జున్ పోరాటమే ఈ చిత్రం అని తెలుస్తుంది. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు. నిఖిల్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటించింది.