హీరో కాస్త న్యూస్ ఛానల్ కు రిపోర్టర్ అయ్యాడు..

విభిన్న కథలతో ప్రేక్షకులను , అభిమానులను అలరించే యంగ్ హీరో నిఖిల్..తాజాగా `అర్జున్ సురవరం` చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టి.ఎన్.సంతోష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ గత కొన్ని రోజులుగా వాయిదాల పడుతూ వస్తూ ఎట్టకేలకు మే 01 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అర్జున్ లెనిన్ సురవరం పాత్రలో నిఖిల్ నటించాడు. సినిమాలోనే కాదు చిత్ర ప్రమోషన్లలో కూడా జర్నలిస్ట్ అవతారమెత్తాడు. ప్రముఖ ఛానెల్ టీవీ 9కు రిపోర్ట్ అయ్యాడు. వీధుల్లో తిరుగుతూ జనం వద్దకు వెళ్లి రకరకాల విషయాలపై మాట్లాడుతున్నాడు. అంతేకాదు త్వరలోనే రీసెంట్ ఎల‌క్ష‌న్స్ లో అంద‌ర్ని యూట్యూబ్ లో ఎంట‌ర్‌టైన్ చేసిన ఓ లీడ‌ర్ ని ఇంటర్వ్యూ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాడు. నిఖిల్ సినిమా ఫై చేస్తున్న ప్రమోషన్ ను చూసి నిర్మాతలంతా కూడా మాట్లాడుకుంటున్నారు.

సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఠాగూర్ మధు ఈ సినిమాను తెలుగులో నిర్మిస్తున్నారు.