రుద్రాక్ష అనేదే లేదట..

రుద్రాక్ష ఈ పేరు నిన్నంతా సోషల్ మీడియా లో హల్చల్ చేసింది..క్రెయేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ రుద్రాక్ష పేరుతొ ఓ లేడి ఓరియంటెండ్ సినిమా తెరకెక్కించబోతున్నారని..దీనికి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేయబోతున్నాడంటూ..త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రాబోతుందంటూ నిన్నంతా తెగ హడావిడి చేసాయి. కానీ ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కృష్ణవంశీ తేల్చి చెప్పారు.

అసలు తానుగా చెప్పే దాకా ఏ వార్తని పుకారుని నమ్మకండని చెబుతూ ఏదైనా ఉంటే తానే స్వయంగా ప్రకటిస్తామని చెప్పారు. దీనిబట్టి చూస్తే రుద్రాక్ష న్యూస్ ఫేక్ అని తేలిపోయింది. అయితే ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. పదేళ్ల క్రితమే చిరంజీవి హీరోగా వందేమాతరం అనే చారిత్రాత్మక చిత్రం వంద కోట్ల బడ్జెట్ తో కృష్ణవంశీ ప్లాన్ చేసారని గాసిప్స్ వచ్చాయి. ఆయన కథ రాసుకున్న మాట నిజమే కానీ అది కార్యరూపం దాల్చే దిశగా ఏనాడూ అడుగులు పడలేదు. ఇప్పుడీ రుద్రాక్ష విషయంలోనూ అదే జరిగింది.