నోటా ప్రీమియర్ షో టాక్…

పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో తన సత్తా చాటిన విజయ్ దేవరకొండ..తన మార్కెట్ ను సైతం పెంచుకున్నాడు. కేవలం మూడు సినిమాలతోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత విజయ్ నుండి వస్తున్న చిత్రం నోటా.

స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేయగా , మెహ్రిన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈరోజు( అక్టోబర్ 5 న ) ఈ చిత్రం విడుదల కానుంది. విజయ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో భారీ ఎత్తున విడుదల చేసారు. అలాగే చాల చోట్ల ప్రీమియర్ షోస్ ఓ రోజు ముందే పడడం జరిగింది. దీంతో చిత్ర టాక్ ముందుగానే బయటకొచ్చింది.

‘నోటా’ ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. తమిళ ప్రజలకు కాస్త నచ్చిన కానీ తెలుగు ప్రజలకు మాత్రం పెద్దగా నచ్చాక పోవచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్టాఫ్‌లో వచ్చే పొలిటికల్ సీన్స్, విజయ్ దేవరకొండ మాస్ పొలిటికల్ ప్రెస్ మీట్ ప్రేక్షకులకు బాగా నచ్చవచ్చు. ఇదే ఊపు సెకండాఫ్‌లో కొనసాగి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేదని అంటున్నారు.

డైరెక్టర్ ఆనంద్ శంకర్ సెకండాఫ్‌ను మరీ బోరింగ్‌ సన్నివేశాలతో సాగదీశాడని అవి ప్రేక్షకులను బాగా బోరు కొట్టిస్తాయని అంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఎప్పటిలానే తనదైన నటనతో అక్కటుకున్నాడని, సత్యరాజ్, విజయ్ మధ్య వచ్చే కొన్ని సీన్లు ‘లీడర్’ సినిమాను గుర్తు చేస్తాయని అంటున్నారు. మొత్తం మీద నోటా బిలో యావరేజ్ గా చెపుతున్నారు. మరి మన ప్రేక్షకులకు నోటా ఎలా నచ్చుతుందో చూడాలి.