ఎన్టీఆర్ 30 టైటిల్ చేంజ్ చేస్తున్నారా..?

అల వైకుంఠపురం లో చిత్రంతో నాన్ బాహుబలి రికార్డు కొట్టిన త్రివిక్రమ్ ..ప్రస్తుతం నాల్గు సినిమాలను లైన్ లో పెట్టాడు. వాటిల్లో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ 30 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 1 నుండి సెట్స్ పైకి వెళ్లనుందట. నిజానికి ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ లోనే మొదలుపెట్టాలన్నది ప్లాన్ అయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా అది కుదరలేదు.

ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్‌ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకి మరో టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తుండటంతో.. టైటిల్ అన్ని భాషల్లో ఈజీగా రీచ్ అవ్వాలంటే.. అచ్చ తెలుగు టైటిల్ కాకుండా.. ఏ ఆర్ఆర్ఆర్ లాగానో అన్ని భాషల వాళ్లకు అర్ధం అయ్యేలా ఒకే టైటిల్ పెడితే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారట. మరి ఫైనల్ గా ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాలి.