మనోజ్ సపోర్ట్ జనసేనకే


మంచు మనోజ్ వార్తలోకి వచ్చారు . ఫీజు రియింబర్స్మెట్ తాలూకు బిల్లులు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడం లేదని నిన్న తిరుపతిలో చంద్రబాబు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మంచు మనోజ్ కూడా పాల్గొన్నాడు. అయితే దీక్ష గురించి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కొన్ని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన మంచు మనోజ్ ట్విట్టర్ సాక్షిగా సమాధానం ఇచ్చాడు. ఇక ట్విట్టర్లో మంచు మనోజ్ని అతని అభిమానులు చిత్రవిచిత్రమైన ప్రశ్నలు అడిగారు. అన్నింటికి ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు మనోజ్.

నెటిజన్ వ్యాఖ్యలకు మంచు మనోజ్ స్పందిస్తూ, తప్పకుండా, తన మద్దతు ఎల్లప్పుడూ జనసేన పార్టీకే ఉంటుందని అన్నాడు.
‘ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారన్నది నీ ఇష్టం. కానీ, ఐదు లేదా పది సంవత్సరాల తర్వాత తారక్ అన్న(జూనియర్ ఎన్టీఆర్) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే..’ అని మరో నెటిజన్ అడిగాడు. ‘తారక్ వస్తే ఇంకా నేను ఎటు వెళ్తాను తమ్ముడూ?! నా మిత్రుడి రాక కోసం ఎదురుచూస్తున్నాం. తారక్ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు’ అని చెప్పాడు మనోజ్.