మళ్ళీ ఎన్టీఆర్ తోనే

మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ కలయికలో సినిమా ప్రకటన వచ్చింది. స్వయంగా రామ్ చరణ్ ఈ ప్రకటన చేశాడు. దానయ్య నిర్మాతగా ఈ సినిమా ఉంటుందని ఓ ఆడియో వేడుకలో వెల్లడించాడు. చిరు కొరటాల సినిమా తర్వాత ఈ సినిమా వుంటుందని అంతా అనుకున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే చిరు- త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో ఉండదని టాక్.

ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ జవారికి ఫ్రీ అయిపోతారు. ఐతే దీని తర్వాత ఆయన ఎన్టీఆర్ కోసం ఓ కథని రెడీ చేస్తారని తెలుస్తుంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో బిజీగా వున్నారు. 2020 ఫిబ్రవరి నాటికి ఆయన ఆ సినిమా నుండి ఫ్రీ అవుతారు. అప్పటికి పూర్తి స్క్రిప్ట్ తో రెడీగా వున్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ తోనే ప్రొసీడ్ అవుతారని టాక్.