జై విశ్వరూపం


ఇప్పుడున్న హీరోలలో త్రిపాత్రాభినయం చేసిన హీరో ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడు అనేలాగా సినిమాలు చేస్తూ పేరు సంపాదించాడు. బాబీ దర్శకత్వంలో ‘జైలవ కుశ’ ఈ చిత్రం కోసం ఆయన తొలిసారి త్రిపాత్రాభినయం చేశారు. అదీ కూడా తాతపేరు మీద అన్నయ కళ్యాణ్ రామ్ నిర్మించిన ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లో చేయడం విశేషం. ‘జైలవ కుశ’ చిత్రం ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌లో ఓ స్పెషల్ మూవీగా నిలిచిపోయింది.

సరిగ్గా ఈ రోజుకు, ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా బాబీ సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. జైలవ కుశ’ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది అయ్యిందంటే నమ్మలేకపోతున్నా. తొలి రోజు తొలి షో చూసిన తర్వాత అభిమానుల స్పందనను ఎప్పటికీ మర్చిపోలేను. ‘జై’ పాత్ర, డైలాగ్స్‌ను మెచ్చుకుంటూ ఇప్పటికీ నాకు ట్వీట్లు చేస్తున్నారు. ‘జై’గా తారక్ స్థానంలో మరొకర్ని ఊహించుకోలేను. దేవిశ్రీ ప్రసాద్‌ తన సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమా వెనుక ఉన్న కల్యాణ్‌రామ్‌, కోన వెంకట్‌, తదితరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని బాబీ పేర్కొన్నారు.

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలుగా నటించారు. ‘జై’గా ఎన్టీఆర్‌ను తప్పా మరొకర్ని ఊహించుకోలేమని , జై పాత్రతో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించాడని సినిమా చుసిన ప్రతి ఒక్కరు ప్రశంసించారు.