అఖిల్ లో గొప్ప క్యాలిటీ చెప్పిన ఎన్టీఆర్

”అఖిల్ గురించి ఒక గొప్ప గుణం చెబుతాను, ఒక నటుడికి ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిమర్శ, అఖిల్ చేసుకున్నంత గొప్పగా ఆత్మవిమర్శ మరెవరూ చేసుకోరేమో” అన్నారు జూనియర్ ఎన్టీఆర్. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ ప్రీ-రిలీజ్ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, అఖిల్ గురించి ఒక గొప్ప గుణం చెబుతాను, ఒక నటుడికి ముఖ్యంగా కావాల్సింది ఆత్మవిమర్శ, అఖిల్ చేసుకున్నంత గొప్పగా ఆత్మవిమర్శ మరెవరూ చేసుకోరేమో. ఎన్నోసార్లు ఆత్మ విమర్శ చేసుకుంటూ, తన పంథాను మార్చుకుంటూ ఈరోజు ఈ మజిలీకి చేరిన నటుడు అఖిల్” అన్నారు.

‘ఈరోజు నేను చెబుతున్నాను రాసిపెట్టుకోండి అఖిల్ విల్ బీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ వన్ డే. ఆరోజు కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. ఆరోజు ఎంతో దూరంలో లేదు. మిస్టర్ మజ్ను’ చిత్రం ద్వారా మీ అందరికీ తెలుస్తుంది. ఈ చిత్రం అఖిల్ కెరీర్ లో ఒక గొప్ప చిత్రంగా మిగలాలని ఆ దేవుడ్ని మనసారా కోరుకుంటున్నా’ అని చెప్పాడు.