త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మూవీ వచ్చేది అప్పుడేనా..?

అల వైకుంఠపురం లో చిత్రంతో నాన్ బాహుబలి రికార్డు కొట్టిన త్రివిక్రమ్ ..ప్రస్తుతం నాల్గు సినిమాలను లైన్ లో పెట్టాడు. వాటిల్లో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ 30 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 1 నుండి సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావించినప్పటికీ..ప్రస్తుతం కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉండడంతో ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని 2021 లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా చాల ఉంది. దీంతో ఇది పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లానని నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పటికే చిత్ర నిర్మాతలతో , త్రివిక్రమ్ తో చర్చలు జరిపినట్లు సమాచారం.