ఇస్మార్ట్ శంకర్ ను వీడని నీడ..

గత కొంతకాలంగా సరైన హిట్ లేకుండా భాధ పడుతున్న డైరెక్టర్ పూరి..హీరో రామ్ లు..ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ ఫై భారీ ఆశలే పెట్టుకున్నారు. జులై 12 న ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేసారు. దానికి తగ్గట్లే సినిమా ప్రొమోషన్లను మొదలు పెట్టారు. అయితే ఈ చిత్రానికి నిను వీడని నీడను నేనే అంటున్నాడు సందీప్ కిషన్.
సందీప్ కిషన్ నిర్మాతగా మారి చేసిన తొలి సినిమా ఇది. ఈ సినిమాను జూలై 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. వెంకటాద్రి ప్రొడక్షన్స్ అంటూ బ్యానర్ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్, తొలి సినిమాను కార్తీక్ సుబ్బరాజు డైరక్షన్ లో నిర్మించాడు.

ఈ సినిమా కోసం రచయిత కోన వెంకట్ బంధువు, సినీ స్టయిలిస్ట్ కోన నీరజ ఓ పాట రాయడం విశేషం. అది కూడా టైటిల్ సాంగ్. రొమాంటిక్ లవ్ స్టోరీకి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి సిద్ధం చేసారు. ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని సందీప్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సందీప్ సరసన అన్యాసింగ్ నటిస్తున్న ఈ సినిమాలో పోసాని, మురళీశర్మ, వెన్నెల కిషోర్, తదితరులు నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఇస్మార్ట్ కు ఎలాంటి పోటీ ఇస్తుందో..ఈ పోరు లో ఎవరు విజేత అవుతారో చూడాలి.