హెచ్ డీ క్వాలిటీతో బయటకొచ్చిన పందెం కోడి 2

పైరసీ రాయుళ్లు చెప్పినట్లే చేసి చూపించారు..కొంతకాలంగా తమిళనాట విశాల్ కు – పైరసీ చేసే వారికీ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ నుంచి పైరసీ అనేదే లేకుండా చేస్తానని విశాల్ శపధం చేయడం దానికి పైరసీ సైట్లు కూడా స్వీకరించడం జరిగింది. ఇక నుంచి విశాల్ నటించిన ప్రతి సినిమాను పైరసీ చేస్తామని పబ్లిక్ గా వారు హెచ్చరించారు. ఇందులో భాగంగా విశాల్ నటించిన తాజా చిత్రం పందెంకోడి-2 ని పైరసీ చేసి నెట్ లో వదిలారు.

దసరా కానుకగా అక్టోబర్ 18 న వచ్చిన ఈ మూవీ , కనీసం విడుదలై రెండు రోజులు గడవకముందే హెచ్ డీ క్వాలిటీతో సినిమాను నెట్ లో పెట్టేసారు. దాదాపు 2 జీబీ సైజ్ ఉన్న ఈ ఫైల్ ను డౌన్ లోడ్ కూడా చేసుకునే విధంగా పైరసీ చేసి నెట్ లో పెట్టి వారు అనుకున్నది సాధించారు. తమిళనాడులోని త్రిచూర్, తంజావురు జిల్లాల్లో ఎక్కువగా పైరసీ జరుగుతుందని తెలిసి ఆ ప్రాంతాల్లో పందెంకోడి-2ను విశాల్ రిలీజ్ చేయలేదు. అలా తన సొంత బిజినెస్ ను కూడా వదులుకొని పైరసీని అరికట్టాలనుకున్నాడు. కానీ పైరసీ మాత్రం ఆగలేదు. ఈ పైరసీ దెబ్బతో సినిమా కలెక్షన్లకు భారీ దెబ్బ పడనుంది.

లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతి లాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు.