కత్తి మహేష్ కు డబ్బులు ఇస్తున్న పవన్ ఫ్యాన్స్

కత్తి మహేష్..ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచే ఈయనకు పవన్ కళ్యాణ్ అభిమానులు , జనసేన కార్య కర్తలు డబ్బులు ఇస్తున్నారట. పవన్ కళ్యాణ్‌పై వీలు చిక్కినా, చిక్కకపోయినా మహేష్ విమర్శలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్‌ను తిట్టి, బెదిరించి లాభం లేదనుకున్నారో ఏమో గాని పవన్ కళ్యాణ్ అభిమానులు వినూత్నంగా నిరసనకు దిగారు. మహేష్‌కు చిల్లర డబ్బు పంపించి నిరసన తెలుపుతున్నారట.

దీనిని కూడా కత్తి మహేష్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తనకు చిల్లర డబ్బులు కాదని, ఆ పంపేదేదో, రూ. 100 లేక రూ. 1,000 పంపాలంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి కత్తి మహేష్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘‘అయ్యా పవన్ కళ్యాణ్ అభిమానులూ! నా గూగుల్ పే నంబర్. నా బ్యాంకు అకౌంట్ వివరాలు తెలుసుకుని నాకు 1 రూపాయి. 5 రూపాయలు పంపిస్తున్నారు. మీ ఉద్దేశం ఏమైనా గానీ.. సంతోషం. కానీ, పెరిగిన ద్రవ్యోల్బణం మరియు నా ఖర్చుల దృష్ట్యా ఆ పంపేదేదో 100 రూపాయలో, 1000 రూపాయలో పంపితే, కనీసం నా మందులో మంచింగ్ ఖర్చుకు పనికొస్తుంది. మీ పవర్ స్టార్ మానంమర్యాదలు నిలబడతాయి. ధన్యవాదాలు. ఇట్లు.. మీ చిల్లర అభిమానానికి పాత్రుడు.. కత్తి మహేష్.’’ అంటూ పోస్టు చేశారు.