పవన్ ఇన్స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డు ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు అభిమానుల్లో ఎక్కడలేని ఆనందం , ఉద్వేగం వస్తుంది. సినిమాల పరంగానే కాక నిజ జీవితంలో పవన్ వ్యక్తిత్వాన్ని అంత ఇష్టపడతారు. కేవలం సినీ ప్రేక్షకులు , అభిమానుల్లోనే కాదు సినీ స్టార్స్ లోను పవన్ కు వీరాభిమానులు ఉన్నారు.

ఇక సోషల్ మీడియా లోను పవన్ కు ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో పవన్ పుట్టినరోజు కోసం భారీ ట్రెండ్ లు చేస్తున్నారు.ఇప్పుడు ఈ ప్లాట్ ఫామ్ తో పాటుగా మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో పవన్ పేరును హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్ ను ఏకంగా 1 మిలియన్ పోస్టులు వేసి రికార్డు నెలకొల్పారు.

దీనితో పవన్ మన టాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో టాప్ 5 లో నిలిచారు. ఇక్కడే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే టాప్ 4 లో ఉన్న మిగతా హీరోలకు అధికారికంగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నాయి కానీ పవన్ ఎలాంటి అధికారిక లేదు.