ఒకేసారి రెండు షూటింగ్ చేయబోతున్న పవన్

రీసెంట్ గా వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్..ఇప్పుడు తదుపరి చిత్రాల ఫై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న చిత్ర షూటింగ్ తో పాటు సాగర్ డైరెక్షన్లో చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ షూటింగ్ చేయబోతున్నాడు.

టైమ్ చాలా తక్కువ ఉండటంతో పవన్ రెండు సినిమాలను ఒకేసారి చేస్తున్నారు. పైగా రెండు చిత్రాల్లోనూ ఆయన లుక్ దాదాపు ఒకేలా ఉండటంతో ఈ ప్లాన్ బాగా కలిసొచ్చింది. హైదరాబాద్ నగర శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద రెండు సినిమాల సెట్లను నిర్మించారు. పవన్ కంఫర్ట్ కోసం సెట్లు రెండూ పక్కపక్కనే ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో పవన్ తక్కువ వ్యవధిలోనే రెండు సినిమాల షూటింగ్లల్లో పాల్గొంటున్నారు.