పవన్ ‘పింక్’ రీమేకా?!.. కోబలి బెటర్

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం చర్చలు జరుగుతున్నాయి. క్రిష్ తో సినిమా ఓకే అయిపోయిందని కొందరు చెబుతున్నారు. మరికొందరు పవన్ కళ్యాణ్ కలల ప్రాజెక్ట్ ‘సత్యాగ్రాహి’తో వస్తాడని అంటున్నారు. ఇప్పుడు మరో న్యూస్ హాల్ చల్ చేస్తుంది. బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ సినిమాని పవన్ కళ్యాణ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ న్యూస్ కొందరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో టెన్షన్ పుట్టిస్తుంది.

దీనికి కారణం ఆ సినిమా కధ. మంచి కధే. కానీ పవన్ కళ్యాణ్ కి అస్సల్ షూట్ కాదు. పార్క్ లో కూర్చుని నలుగురు అమ్మాయిలని పరిశీంచే ఓ ముసలి లాయర్.. ఆ అమ్మాయిలకి ఓ కష్టం వస్తే కోర్టులో వాదించి గెలిపించే పాత్ర. మంచి మెసేజ్ వుంటుంది. అయితే ఈ పాత్ర చేయడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకోవాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ లెక్క వేరు. ఈ సినిమా చేస్తే మటుకు ఇంకా డల్ అయిపోతారు ఫాన్స్. ఇదే పవన్ అభిమానుల బెంగ.

ఇవన్నీ కాదు కానీ త్రివిక్రమ్ పవన్ కోసం ‘కోబలి’ అనే ఓ కధని రాసి పెట్టుకున్నాడు. దానిపై పవన్ కి కూడా మంచి గురి వుంది. మాసు, మెసేజూ రెండు వుండే కధ అది. పవన్ త్రివిక్రమ్ కి లెక్క కుదురుతుంది. ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ అయితే మాత్రం పవన్ ఎంట్రీ పై డిఫరెంట్ హైప్ వస్తుంది. ‘అల వైకుంఠపు’రం బ్లాక్ బస్టర్ అయితే కనుక పవన్ మళ్ళీ త్రివిక్రమ్ వైపు చూసే ఛాన్స్ అయితే లేకపోలేదు.