జగన్ టీంకి మాంచి ఊపు తెచ్చిన పాయల్

తేజ కొత్త సినిమా సీత. బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ జంట. ఈ సినిమాలో పాయల్ కూడా వుంది. హీరోయిన్ గా కాదు. ఐటెం గర్ల్ గా. ‘రెడ్డిగారి కుర్రాళ్లిట్ట.. రెచ్చిపోతే ఎట్టాగంట..’ అంటూ ఓ హాట్ ఐటెం సాంగ్ లో స్టెప్పులు వేసింది పాయల్. ‘బుల్లెట్‌ మీదొచ్చె బుల్‌ రెడ్డి.. యమహా ఏసుకొచ్చె యాదిరెడ్డి..’ అంటూ సాగుతున్న ఈ పాట మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంది. ‘సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అంటూ ఈ పాటని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

అన్నట్టు.. ఈ పాటపై అప్పుడే బోలెడు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంది. ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ పోటీపడుతున్నాడు. ఆయనది రెడ్డి సామాజిక వర్గం. ఆయన అభిమానులు అంతా మాంచి ఊపులో వున్నారు. ఆ ఊపుని మ్యాచ్ చేస్తూ.. ‘రెడ్డిగారి కుర్రాళ్లిట్ట.. రెచ్చిపోతే ఎట్టాగంట..’ అంటూ ఓ పాట రావడం యాదృచ్చికమేనైనా కరెక్ట్ గా తగిలింది. ఈ వీడియో చూసిన చాలా మంది జనాలు పాయల్ జగన్ టీమ్ లో మాంచి జోరుని తీసుకొచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. మొన్న సాయి ధరమ్ తేజ్ కూడా గ్లాస్ మేట్స్ అని జనసేన గాజు గుర్తుని కాయిన్ చేస్తూ ఓ పాట వదిలాడు. ఇది అంత పెద్దగా ఎక్కలేదు. మరి రెడ్డిగారి పాట ఏమౌతుందో చూడాలి.