పెళ్లి చూపులు బాలీవుడ్ ట్రైలర్ చూశారా ?


చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది పెళ్లి చూపులు. ఇటు విమర్శకులు అటు ప్రేక్షకులు ఈ సినిమా పై ప్రసంశల వర్షం కురిపించారు. సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి అప్లాజ్ లభించింది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ కి వెలుతుంది.

‘మిత్రోం’ పేరుతో రిమేక్ అయిన ఈ సినిమాలో పాపులర్ ప్రొడ్యూసర్ వషు భగ్నాని కొడుకు జాకీ భగ్నాని హీరోగా నటించాడు. కృతిక కమ్రా హీరోయిన్. ‘ఫిల్మిస్తాన్’ ఫేమ్ – నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ డైరెక్టర్. ఈరోజే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

ఈ ట్రైలర్ చుస్తే.. టివిటీ ఛేంజేస్ తప్ప దాదాపు ఒరిజినల్ సినిమాను ఫాలో అయ్యారని అనిపిస్తోంది తెలుగు లో ఉన్న కామెడి టచ్ హిందీలో కూడా ఉంది. ప్రొడ్యూసర్ తనయుడు హీరో కాబట్టి ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.