పిక్ టాక్ : పెళ్లి వేడుకల్లో రానా – వెంకీ- సురేష్ బాబు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఈరోజుతో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ రోజే (ఆగస్టు 8) రానా- మిహికా వివాహ వేడుక రామానాయుడు స్టూడియోలో జరగనుంది. ఇప్పటికే అన్ని సదుపాయాలతో పెళ్లి ఏర్పాట్లు, కళ్ళు చెదిరే డెకరేషన్ చేయించారట రానా తండ్రి సురేష్ బాబు. గత మూడు రోజులుగా ఇరు కుటుంబాల్లో పెళ్లి వేడుకలు అంగారనాగ్ వైభవంగా జరుగుతున్నాయి.

హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, పెళ్లి కొడుకును చేయడం లాంటి కార్యక్రమాలతో రెండు కుటుంబాలు రెండు రోజులుగా సందడి సందడిగా మారాయి. తాజాగా సురేష్ బాబు , వెంకటేష్ , రానా ముగ్గురు కలిసి పెళ్లి బట్టల్లో ఇచ్చిన పోజ్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. అబ్బా ఏమన్నా ఉందా స్టిల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.