పూనమ్ BF పిక్స్ హల్చల్

మొదటి సినిమా , ప్రేమంటే ఇంతే , బాస్ , పరుగు వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ను పలకరించిన పూనం బజ్వా ఆ తర్వాత మళ్లీ పెద్దగా కనిపించలేదు..కనీసం మీడియా కు సైతం అమ్మడు దొరకలేదు.ఇక చాల రోజుల తర్వాత ఈ అమ్మడు వార్తల్లోకి ఎక్కింది.. అది కూడా సోషల్ మీడియా ద్వారానే.. పూనమ్ తరచుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తూ వచ్చింది.

తాజాగా ఈ బ్యూటీ త‌న భాయ్ ఫ్రెండ్ ను అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. క్రైమ్ లో, జీవితం, రొమాంటిక్ డేట్, ఆట లో ఇలా అన్నింటిలో నా భాగ‌స్వామి. నువ్వు నా క‌ల‌ల‌న్నీ బ్ర‌హ్మాండంగా ఉండేలా, అన్ని క్ష‌ణాలు మ్యాజిక్ గా చేసే క్రియేట‌ర్ వి. ఆనందం, ఆరోగ్యం, ఉత్సాహం, ప్రేమ‌, స‌ర‌దా, ఉల్లాస‌వంత‌మైన ఈ క్ష‌ణం నుంచి నా ప్ర‌యాణం. నేను ఎప్పుడూ చెప్పే ప‌దాల కంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను అంటూ..త‌న భాయ్ ఫ్రెండ్ సునీల్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది.

ఇద్ద‌రూ క‌లిసి స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోల‌ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.