మహేష్ బాబుని మరీ దారుణంగా..

సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఓ తమిళ వ్యక్తి నోరు పారేసుకున్నాడు. తమిళనాట స్టాండప్‌ కమెడియన్‌గా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న మనోజ్‌ ప్రభాకర్‌ .. మహేష్ ని దారుణంగా విమర్సించారు. అసలు మహేష్ బాబుకి నటనే రాదంటూ అవమానించాడు.

మహేష్ నటనలో రాకింగ్ అంటూ.. ఆయన హావభావాలు ఇలా ఉంటాయి అంటూ రెండు రాళ్లను చూపించి వాటితో మహేష్ మఖాన్ని పోల్చాడు. ఇక తమిళ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్పైడర్’ మూవీలో ఎస్ జే సూర్య ముందు తేలిపోయాడని.. ఆయనకు అసలు నటనే రాదంటూ సంచలన కామెంట్ చేశాడు.
ఇక మహేష్ అందం గురించి మాట్లాడుతూ.. మహేష్ ను కత్రినాకైఫ్ ను పక్కనపెడితే.. మహేష్ మగ కత్రినాకైఫ్ లా ఉంటాడు అంటూ దారుణంగా విమర్సించారు. కేవలం తన ప్రచారం కోసం మహేష్ ను ఇలా వాడుకొడవం దారుణమని చెప్పాలి.