ఆదిపురుష్ డైరెక్టర్ కు స్ట్రిక్ట్ ఆర్డర్స్‌ ఇచ్చిన ప్రభాస్

ప్ర‌భాస్ .. ఓంరావ‌త్ డైరెక్ష‌న్ లో ఆదిపురుష్ చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నుండ‌గా..సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్ర‌లో క‌నువిందు చేయ‌నున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఓ అప్డేట్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ ఆదిపురుష్ కోసం జస్ట్ తొంబై రోజులు మాత్రమే డేట్స్‌ ఇచ్చారట. ఏమైనా చెయ్‌… ఈ 90 డేస్‌లోనే షూటింగ్ కంప్లీట్‌ చేసేయాలని డైరెక్టర్‌కు స్ట్రిక్ట్ ఆర్డర్స్‌ పాస్‌ చేసేశారట.

మాగ్జిమమ్‌ షూట్‌… గ్రీన్‌ మ్యాట్‌లోనే కాబట్టి ఛాలెంజ్‌ యాక్సెప్టెడ్‌ అని చెప్పేశారు డైరెక్టర్ ఓం రౌత్‌. ఇన్‌ టైంలో డార్లింగ్ షూట్ కంప్లీట్ చేసేలా.. పర్ఫెక్ట్ గా ప్లాన్ ప్రిపేర్‌ చేస్తున్నారు. చూద్దాం.. మరి ఈ సినిమా అయినా ఇన్‌ టైంలో పూర్తి చేస్తారేమో డార్లింగ్‌.